ఇండియాకు ట్రంప్ కూతురు అల్లుడు కూడా..

ఇండియాకు ట్రంప్ కూతురు అల్లుడు కూడా..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కరే కాదు ఆయన కుటుంబం కూడా భారత్ పర్యటనకు రానుంది. ఈ విషయాన్ని అమెరికా అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 24,25 న ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్, కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెద్ కుష్నర్ భారత్ లో పర్యటించనున్నారు.  24న అహ్మదాబాద్ చేరుకోనున్న ట్రంప్ దంపతులు  మోదీతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు మెలానియాతో కలిసి ట్రంప్ తాజ్ మహల్ ను సందర్శిస్తారు. 25న అధికారులు, ప్రతినిధులతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు,వాణిజ్య ఒప్పందాలపై చర్చించనున్నారు.

see more news

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ

కోహ్లీలో పస తగ్గిందా?.