ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ ఆర్టిస్టుపై కేసు నమోదు

ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ ఆర్టిస్టుపై కేసు నమోదు

జబర్దస్త్ కమెడియన్, గాయకుడు నవ సందీప్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది.  తనను ప్రేమించానని చెప్పి సందీప్  మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది.  నవ సందీప్ కు 2018లో వాట్సాప్ చాటింగ్ ద్వారా  28 ఏళ్ల యవతి పరిచయమైంది. ఆ పరిచయం ఇద్దరి మధ్య  ప్రేమగా మారింది. అయితే  ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెను హైదరాబాద్ కు రప్పించిన సందీప్..   షేక్పెట్ లోని అల్ హమారా కాలనీలోని ఓ హాస్టల్లో ఉంచాడు.  నాలుగు సంవత్సరాలుగా ఆ అమ్మాయి ఆ హాస్టల్ లోనే ఉంటోంది. 

ఈ క్రమంలోనే ఇద్దరు శారీరంకంగా కూడా ఒక్కటయ్యారు. అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సందీప్ తనను పలుమార్లు వాడుకున్నట్లుగా యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు పెళ్లి మాటెత్తేసరికి సందీప్ మాట మారుస్తున్నాడని, నేనంటే ఇష్టం లేదని,  వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడంటూ తన ఫిర్యాదులో తెలిపింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు  గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి.. మధురానగర్ పోలీసుస్టేషన్ కు కేసును  బదిలీ చేశారు. మధురానగర్ పోలీసులు  ఈ కేసును  దర్యాప్తు చేస్తున్నారు.