
‘జబర్దస్త్’ షోతో కమెడియన్‌గా గుర్తింపును తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్నాడు. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడు. జయలక్ష్మి సాయి కుమార్ నిర్మిస్తున్నారు. మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్ కొట్టగా, ఏపీ టూరిజం మినిస్టర్ రోజా కెమెరా స్విచాన్ చేశారు.
తనికెళ్లభరణి గౌరవ దర్శకత్వం వహించారు. సాయి కుమార్ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. చిత్ర ప్రారంభోత్సవంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, విఎన్ ఆదిత్య, ప్రవీణ, అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు. అనన్య హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రానికి అంజి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నాడు. పల్లె మట్టివాసన తెలియజేసే సినిమాగా దీన్ని రూపొందిస్తున్నామని తెలియజేశారు.