మనీలాండరింగ్ కేసు : పటియాల కోర్టుకు జాక్వెలిన్

మనీలాండరింగ్ కేసు : పటియాల కోర్టుకు జాక్వెలిన్

ఢిల్లీలోని పటియాల హౌజ్ కోర్టుకు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాజరయ్యారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమె వేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. అయితే  జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను ఈడీ వ్యతిరేకించింది. జాక్వెలిన్ ఎప్పుడూ దర్యాప్తుకు సహకరించలేదని స్పష్టం చేసింది. అయితే జాక్వెలిన్ తరఫు న్యాయవాది తను విచారణకు సహకరించిందని కోర్టుకు తెలిపారు. 

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జాక్వెలిన్ ను ఈడీ నిందితురాలిగా పరిగణించింది.రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లను మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడితో జాక్వెలిన్ కు సన్నిహిత సంబంధాలున్నాయని తేలింది. సుకేశ్ నుంచి ఆమె ఖరీదైన బహుమతులు పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్ కు చెందిన 7 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది . జాక్వెలిన్ ను సుకేశ్ కు పరిచయం చేసిన పింకీ ఇరానీని కూడా  అధికారులు విచారిస్తున్నారు .