మరో రెండు సార్లు గెలిపిస్తే..నేనూ సీఎం క్యాండిడేట్‌‌‌‌నే: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌రెడ్డి

మరో రెండు సార్లు గెలిపిస్తే..నేనూ సీఎం క్యాండిడేట్‌‌‌‌నే: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు : ‘ప్రజలు నన్ను మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను కూడా సీఎం క్యాండిడేట్‌‌‌‌ను అవుతా’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌రెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల నియోజకవర్గాల కంటే మంత్రుల నియోజకవర్గాలు స్పీడ్‌‌‌‌గా డెవలప్‌‌‌‌ అవుతున్నాయన్నారు. 

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌‌‌‌ను రూ. 5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రాంతీయ పార్టీ కాదని, ఇక్కడ కింది స్థాయి నుంచి కష్టపడిన వారు ఎవరైనా సీఎం కావచ్చని, జడ్పీటీసీగా గెలిచిన రేవంత్‌‌‌‌రెడ్డి ఇప్పడు సీఎం కావడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందితే తాను కూడా సీనియర్‌‌‌‌ ఎమ్మెల్యేని అవుతానని, తద్వారా సీఎం అభ్యర్థిని అవుతానని అభిప్రాయపడ్డారు. తనకు కూడా సీఎం పదవి వస్తే జడ్చర్లకు రూ. 5 వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసుకుంటానని చెప్పారు.