సీఎంను కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

సీఎంను కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
  •     సమస్యలు పరిష్కామయ్యేలా చూడాలని విజ్ఞప్తి

 బాలానగర్, వెలుగు :  జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​ రెడ్డి బుధవారం హైదరబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్, ఉదండాపూర్ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉదండాపూర్ నిర్వాసితుల ఆర్అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన ఫైలును రాబోయే కేబినెట్ మీటింగ్‌‌‌‌లో పెట్టి ఆమోదించాలని   కోరారు.

అలాగే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొంత మంది ఇంటి నిర్మాణానికి పునాదులు వేసుకున్నా, అవి ఇందిరమ్మ యాప్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ కాకపోవడం వల్ల వారి బిల్లులు ఆగిపోయాయని వివరించారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించామని, యాప్‌‌‌‌లోని సాంకేతిక సమస్యలు తొలగించి ఆ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు.  

రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో తన తాత దేశ్‌‌‌‌ముఖ్ పేరిట ఉన్న భూమిని రైతుల పేరిట మార్చేందుకు కలెక్టర్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపారని తెలిపారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని అక్కడే ఉన్న  గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.