కొత్త ఇంటికి చేసిన అప్పు తీర్చలేక సూసైడ్.. మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన

కొత్త ఇంటికి చేసిన అప్పు తీర్చలేక సూసైడ్.. మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
  • ఉరేసుకుని ఒకరు మృతి

జడ్చర్ల, వెలుగు: కొత్త ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు తీర్చలేక, మద్యం మత్తులో ఒకరు సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మిడ్జిల్​మండలం దోనూరు గ్రామానికి చెందిన నెలకొంటి శ్రీను(34) భార్య కళావతి జడ్చర్ల తహసీల్దార్ ఆఫీసులో రికార్డు అసిస్టెంట్ గా చేస్తుంది. దంపతులు తమ పిల్లలతో కలిసి జడ్చర్ల టౌన్ లో రెంట్ కు ఉంటున్నారు. కాగా.. దోనూర్​లో కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. ఇందుకు శ్రీను అప్పు చేయగా, తీర్చలేక శుక్రవారం జడ్చర్ల టౌన్ నసరుల్లాబాద్​ రోడ్డులో మద్యం మత్తులో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు టౌన్​ సీఐ కమలాకర్  తెలిపారు.