జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ విచారణ 6కు వాయిదా

జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ విచారణ 6కు వాయిదా

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై ఇవాళ (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు జగన్. తన బదులు లాయర్ హాజరయ్యేందుకు అనుమతించాలని  కోరారు. హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది నిరాకరించింది సీబీఐ కోర్టు. దీంతో సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతేడాది హైకోర్టును ఆశ్రయించారు జగన్.

జగన్ పిటిషన్ పై  శుక్రవారం విచారణ చేపట్టారు జస్టిస్ ఉజ్జల్ భూయాన్. సీఎంగా రోజువారీ విచారణకు హాజరైతే ప్రజా పాలనకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు జగన్. ప్రజా ప్రయోజనాల కోసం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతున్నానని అన్నారు. తన కారణంగా విచారణ ఆలస్యం జరుగుతోందన్న వాదనలో నిజం లేదన్నారు. సీబీఐ వాదనల కోసం విచారణ ఈనెల 6కి వాయిదా వేసింది హైకోర్టు.