
టాలీవుడ్‌లో వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu) క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాల్లో బిజీగా ఉన్నారు.రీసెంట్ గా జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రంగి సినిమాతో ఆకట్టుకున్నారు. లేటెస్ట్ గా జగపతి బాబు ఫ్లైట్ జర్నీలో ఉంటూ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్..మంచి మెస్సేజ్ అందిస్తుంది.
జగపతి బాబు పోస్ట్ చేస్తూ..నా లైఫ్ లో ఫస్ట్ టైం మొదటి ప్యాసింజర్ గా ఫ్లైట్ ఎక్కటం..ఎప్పుడు తొక్కే దొరుకుతుంది..అలాగే..'త్రివిక్రమ్ చెప్పిన, నాకు బాగా నచ్చిన డైలాగ్..విమానం ఎగురుతుంది, నువ్వు కాదు. నువ్వు సీట్ లో కూర్చున్నావ్ అంతే..డైలాగ్ గుర్తొచ్చింది..ఓకే డైలాగ్ లో త్రివిక్రమ్ లైఫ్ చెప్పాడు' అంటూ కొటేషన్ పంచుకున్నారు. ఫ్యాన్స్ సరదాగా జగపతి బాబు ట్వీట్ కి రెస్పాండ్ అవుతూ..‘ఎప్పుడూ చివర ఎక్కుతారా సర్’ అని ఒకరంటే, ఏ మూవీ షూటింగ్‌కు వెళ్తున్నారో అప్‌డేట్ ఇవ్వగలరు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జగపతి బాబు టాలీవుడ్‌లో ఇటు హీరోగా, అటు విలన్‌గా..కీలక పాత్రల్లోరాణిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్నారు. ప్రభాస్ సలార్ లో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిసున్న విషయం తెలిసిందే. అలాగే పుష్ప 2లో, మహేష్ బాబు గుంటూరు కారం లోను నటిస్తున్నారు. జగపతి బాబు చాలా ఇంటర్వూస్ లో తన కెరీర్ గురించి, తన జీవితంలో అటు పోట్లు, హీరోయిన్స్ గురించి ఓపెన్‌గానే మాట్లాడుతుంటారు. అయితే ఏదీ ఎక్కడా లైన్ దాటకుండా ఆలోచింప చేసేదిగా మాట్లాడటంలో నెంబర్ వన్ స్టార్ జగపతి బాబు.
Naa life lo first time first passenger ga flight ekkatum... Eppudu thokkey dorukutundhi... Trivikram cheppina, naaku baaga nacchina dialogue... vimanam eguruthundhi, nuvvu kaadhu... nuvvu seat lo koorchunivunnav anthey.... dialogue gurthocchindi.... okay dialogue lo life… pic.twitter.com/0rk83lXS4n
— Jaggu Bhai (@IamJagguBhai) August 19, 2023