నామినేషన్ల ప్రక్రియకు భారీ బందోబస్తు

నామినేషన్ల ప్రక్రియకు భారీ బందోబస్తు

జగిత్యాల టౌన్/ సిరిసిల్ల టౌన్, వెలుగు:  నామినేషన్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీలు సన్ ప్రీత్ సింగ్, అఖిల్ మహాజన్ అన్నారు. ఆయా పట్టణాల్లోని నామినేషన్ కేంద్రాలను ఎస్పీలు గురువారం పరిశీలించారు. జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలక్షన్​ రూల్స్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకరిం చాలని కోరారు. 
 
ఆర్వోలకు నామినేషన్​ పత్రాలు సమర్పించాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను నవంబర్3 నుంచి రిటర్నింగ్ అధికారుల ఆఫీస్​లో అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల లీడర్లతో సమావేశం నిర్వహించారు. సువిధ పోర్టల్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తును సమర్పించినప్పటికి  పత్రాలపై అభ్యర్థి స్వయంగా సంతకం చేసి ఆర్వో ఆఫీస్ లో ఇవ్వాలని పేర్కొన్నారు.

అనంతరం నోడల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ రోజు డ్యూటీలో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో చొప్పదండి,మానకొండూర్,కరీంనగర్,హుజురాబాద్ ఆర్వోలు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, కె. మహేశ్వర్, రాజు, ఆర్డీఓ పవన్ కుమార్ పాల్గొన్నారు. 

 జిల్లాకు ఎన్నికల పరిశీలకులు

జగిత్యాల టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు సంతోష్ కుమార్ జగిత్యాలకు వచ్చారు. జిల్లా ఎన్నికల అధికారిని యాస్మిన్ బాష, అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, దివాకర, ఆర్డీఓ నరసింహమూర్తి సంతోష్​కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీధర్, నరేశ్, సుజాత, భీమ్ కుమార్ పాల్గొన్నారు.

ALSO READ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళలకు నిరాశే