మంత్రి పర్యటనను అడ్డుకుంటారని అరెస్టు

మంత్రి పర్యటనను అడ్డుకుంటారని అరెస్టు

జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో అడ్లూరి లక్ష్మణ్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ( RFCL)లో కొలువుల దందాకు నిరసనగా రాజారాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఇదే రూట్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన ఉండటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటారని అరెస్ట్ చేసి మల్యాల పోలీసు స్టేషన్ కు తరలించారు.