ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • ఢిల్లీ వెళ్లిన జగిత్యాల రైతులు
  • ఎంపీ అరవింద్​ ఆధ్వర్యంలో 
  • కేంద్ర మంత్రిని కలిసిన బృందం
  • పలు సమస్యలపై చర్చ

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ​ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్, సహాయ మంత్రి కైలాష్ చౌదరీని కలిసి పలు సమస్యలను వివరించారు. పసుపు మద్దతు ధర, చెరుకు పంట పునరుద్ధరణ, మామిడి మార్కెట్ అభివృద్ధి, మిర్చి మార్కెట్ ఏర్పాటు, ఉపాధి హామీ వ్యవసాయానికి అనుసంధానం, రుణాల పరిమితి పెంచాలని కోరారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడారు. పసుపునకు మద్దతు ధర కల్పించడానికి గతంలో కేంద్ర వాటాగా ఉన్న 30శాతాన్ని 50శాతంగా భరించడానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. వచ్చే నెలలో జగిత్యాలలో జరిగే భారీ బహిరంగసభలో రైతులతో కలిసి బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్​మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, రైతులు కె. మోహన్ రెడ్డి, బి. మల్లన్న, వై.జలంధర్,  రాజాశేఖర్,  రాజీరెడ్డి, నారాయణ, కరుణాకర్ తదితరులు ఉన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​

గంగాధర/ జగిత్యాల, వెలుగు : కరెంట్​ షాక్ కు గురై​ చికిత్స పొందుతూ చనిపోయిన బక్కశెట్టి మల్లారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువారం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్​రూం ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.5 లక్షల రైతుబీమా అందజేస్తామన్నారు.

గంగపుత్రుల అభివృద్ధే  ధ్యేయం

ముదిరాజులు, గంగపుత్రులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తోందదని ఎమ్మెల్యే రవి శంకర్ అన్నారు. గురువారం కొడిమ్యాల మండలం కొండాపూర్ మైసమ్మ చెరువులో రెండు లక్షల చేప పిల్లలను వదిలారు. కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలోని అన్ని చెరువులలో నీళ్లు నింపుకుంటున్నామన్నారు. గతంలో ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన చేపలను అమ్మేవారని, ఇప్పుడు తెలంగాణలోనే చేపల ఎగుమతి విపరీతంగా పెరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కృష్ణారావు పాల్గొన్నారు.

రాష్ట్రపతి భవన్​లో ప్రతిభ చూపాలి
స్టూడెంట్స్​కు కలెక్టర్​ అభినందన

పెద్దపల్లి, వెలుగు: జాతీయ  స్థాయి ఇన్​స్పైర్​ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను పెద్దపల్లి కలెక్టర్​ డాక్టర్​ సంగీత గురువారం కలెక్టరేట్​లో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టూడెంట్లు రాష్ట్రపతి భవన్​లో ప్రతిభ చూపాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని డి.హర్షిత ‘కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ మల్టీపుల్ హెల్మెట్’ అనే ఎగ్జిబిట్,​ సుల్తానాబాద్ అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.పూజశ్రీ తయారుచేసిన ‘యాక్సిల్ కెమెరా ఫర్ స్కూల్ బస్’ ప్రదర్శనలో విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. వచ్చే ఏడు మార్చిలో రాష్ట్రపతి భవన్​లో నిర్వహించే పోటీల్లో పాల్గొనడానికి అవకాశం దక్కించుకున్నారన్నారు. కార్యక్రమంలో డీఈఓ మాధవి, సైన్స్ ఆఫీసర్​రవినందన్​రావు తదితరులున్నారు. 

అవయవ దానానికి కాంట్రాక్టర్ అంగీకారం
సత్కరించిన మేయర్, కార్పొరేటర్లు

గోదావరిఖని, వెలుగు: నేత్ర, అవయవ దానం చేయడానికి ముందుకొచ్చిన మున్సిపల్ కాంట్రాక్టర్ జంగపల్లి విశ్వతేజను రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు అభినందించారు. గురువారం మున్సిపల్ ఆఫీస్​లో మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా విశ్వతేజ అవయవదానానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. మూఢ నమ్మకాలతో అవయవ దానానికి ఎవరూ ముందుకు రావడం లేదని, విశ్వతేజ లాంటి యువతరం ముందుకువస్తే ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. అనంతరం విశ్వతేజకు శాలువా కప్పి, సదాశయ ఫౌండేషన్ ప్రశంస పత్రం అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్, డి. శ్రీనివాస్, కె. కృష్ణవేణి, కె. సరోజినీ, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు టి.శ్రవణ్  కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గర్భిణులకు సామూహిక సీమంతం  

తిమ్మాపూర్, వెలుగు: మండలంలోని నుస్తులాపూర్ లో గర్భిణులకు గురువారం సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రావుల రమేశ్​సుమారు 50 మందికి పూలు, పండ్లు, చీరలు అందించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.5,116  కానుకగా అందజేస్తానన్న హామీ మేరకు గ్రామంలోని ఇద్దరు ఆడపిల్లల తల్లిదండ్రులకు పిల్లల పేరుపైన ఫిక్స్​డ్​డిపాజిట్​చేసిన చెక్కులు ఇచ్చామన్నారు.  తన తండ్రి రాంచంద్రం స్మారకార్థం నుస్తులాపూర్ జీపీకి జనవరి నుంచి అంబులెన్స్ ను అందించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. వైస్ ఎంపీపీ వీరారెడ్డి, ఎంపిటిసి తిరుపతి రెడ్డి, ఏసీడీపీఓ సరస్వతి, ఐసీడీఎస్​ సూపర్​వైజర్​ శ్రీలత తదితరులు ఉన్నారు.

కెనాల్​లో పడి విలేకరి మృతి

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలకేంద్రానికి చెందిన నమస్తే తెలంగాణ విలేకరి దుశేటి మహేందర్​రెడ్డి(48) ప్రమాద వశాత్తు కాకతీయ కెనాల్​లో పడి చనిపోయారు. మహేందర్​రెడ్డి తిమ్మాపూర్​మండల రిపోర్టర్​గా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మహేందర్​రెడ్డి ఈనెల 20న సాయంత్రం తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వస్తూ రాజీవ్ రహదారి పక్కనే ఉన్న కాకతీయ కెనాల్​లో పడిపోయాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఎవరూ గమనించలేదు. గురువారం హన్మకొండ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన డెడ్​బాడీ కనిపించింది. సుమారు 20 ఏండ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న మహేందర్​రెడ్డికి సౌమ్యుడిగా పేరుంది. మహేందర్​రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

త్వరలో డబుల్​ ఇళ్లు పూర్తి చేస్తాం
ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల, వెలుగు: పట్టణ నిరుపేద ప్రజల చిరకాల కోరిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని, నూకపల్లిలో ప్రారంభించిన 4,520 డబుల్​ఇండ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం నూకపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం జగిత్యాల అర్బన్ మండలం అంబారీపేటలో  రూ.20 లక్షలతో నిర్మించిన జీపీ భవనాన్ని చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, భోగ ప్రవీణ్, పీఏసీఎస్ చైర్మన్ సాగర్ రావు, జడ్పీటీసీ మహేశ్, సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి

మంథని, వెలుగు : స్థానిక మున్సిపాలిటీ పరిధి కుచిరాజ్ పల్లి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి అడ్డూరి వంశీ(23) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మంథని మండలం అక్కపల్లికి చెందిన అడ్డూరి వంశీ సొంత పనుల కోసం గురువారం మంథనికి ట్రాక్టర్​పై వస్తుండగా కుచిరాజ్ పల్లి సమీపంలో ట్రాక్టర్ఆదుపు తప్పి బోల్తాపడింది. దీంతో వంశీ ట్రాక్టర్​కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించాలి

కలెక్టర్ అర్.వి. కర్ణన్ క​రీంనగర్ సిటీ, వెలుగు: ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఎంగిలిపూల బతుకమ్మ నుంచి అక్టోబర్ 3న  జరిగే సద్దుల బతుకమ్మ వరకు  ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్​కాన్ఫరెన్స్ హాల్ లో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బతుకమ్మ పండుగను జిల్లాలోని తెలంగాణ సర్కిల్ వద్ద, మహత్మ జ్యోతీబా పూలే గ్రౌండ్​లో 9 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 16 మండలాల్లోని 2,46,544 చీరలను పంపిణీ చేశామన్నారు.  

పనులను వేగంగా చేయాలి..

కరీంనగర్ లోని కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం రెవెన్యూ, ఆర్అండ్ బీ అధికారులతో కలసి కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు  పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను  కచ్చితంగా పాటించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్​ కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, ట్రెని కలెక్టర్ లెనిన్  తదితరులు పాల్గొన్నారు. 

సంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ లీడర్లు

కోనరావుపేట,వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు కోనరావుపేట బీజేపీ మండలాధ్యక్షుడు గొట్టె రామచంద్రం ఆధ్వర్యంలో మండల బీజేపీ నాయకులు గురువారం హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు రవి, తిరుపతి, ఎంపీటీసీ ప్రవీణ్, బీజేవైఎం అధ్యక్షుడు సురేశ్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.   

చొప్పదండి: నాల్గవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా పెద్ద అంబర్​పేటలో జరుగుతున్న బహిరంగ సభకు చొప్పదండి, రామడుగు, కరీంనగర్​ రూరల్ మండలాల నుంచి బీజేపీ లీడర్లు గురువారం తరలివెళ్లారు. వారిలో బీజేపీ మండలాధ్యక్షుడు మావురం సుదర్శన్​రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్​గౌడ్​, బత్తుల లక్ష్మీనారాయణ,నాయకులు కల్యాణ్, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.

‘శిశువు మృతి’పై అధికారుల విచారణ
రాత పూర్వక సమాధానం ఇవ్వాలని డాక్టర్లకు ఆదేశాలు 

మెట్ పల్లి, వెలుగు : స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో బుధవారం పురిట్లో శిశువు మృతి చెందిన ఘటనపై అధికారులు స్పందించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం ఆర్డీఓ వినోద్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ సుదక్షిణ విచారణ చేశారు. బాధితురాలు సుజాత డెలివరీ కోసం హాస్పిటల్ లో ఎప్పుడు అడ్మిట్ అయ్యింది.. ఆ రోజు నుంచి డెలివరీ అయ్యి శిశువు మృతి చెందిన టైం వరకు ఎం జరిగిందనే విషయమై వివరాలు తెలుసుకున్నారు. పురిటి నొప్పులు వచ్చినా ఆపరేషన్ ఎందుకు చేయలేదో రాత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని డాక్టర్ ను ఆదేశించారు. అనంతరం బాధితురాలు సుజాత పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాజిద్ అహ్మద్, డాక్టర్లు రామకృష్ణ, అమరేశ్వర్, రాజేశ్వర్ పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్టు  కార్మికుల చర్చలు విఫలం 


గోదావరిఖని, వెలుగు: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. గురువారం సెంట్రల్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ చీఫ్ లేబర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ డి.శ్రీనివాసులు సమక్షంలో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు, కార్మిక సంఘాల జేఏసీ లీడర్లకు మధ్య చర్చలు జరిగాయి. అయితే కార్మికుల సమస్యల పరిష్కారానికి మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో చర్చలు సెప్టెంబర్​26వ తేదీకి వాయిదా వేశారు. చర్చలో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తరఫున పర్సనల్‌‌‌‌‌‌‌‌ జీఎం ఏ.ఆనందరావు, సివిల్ జీఎం సీహెచ్ రమేశ్​ బాబు, పర్సనల్ ఏజీఎం కవిత నాయుడు, జేఏసీ లీడర్లు సత్యనారాయణ, సునీల్, బి.మధు పాల్గొన్నారు. 

టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణే లక్ష్యం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు

మెట్ పల్లి, వెలుగు: టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ముందుకెళ్లాలని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు అన్నారు. గురువారం మెట్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం సత్తెకపల్లి, రాజేశ్వర్రావు పేట, బండలింగాపూర్, వెల్లుల్ల, విట్టంపేట, మెట్లచిట్టపూర్, ఎస్సార్ తండా, రంగారావు పేట, రామలచ్చక్క పేట, ఆత్మ నగర్, ఆత్మకూర్, జగ్గాసాగర్, పెద్దాపూర్, కొండ్రీకర్ల గ్రామాలలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యోజకవర్గ ఇన్​చార్జి వెంకట్, లీడర్లు పాల్గొన్నారు.

‘కాంపౌండ్ వాల్’ కూలగొట్టారు
వెలుగు కథనానికి స్పందన 

కరీంనగర్, వెలుగు: ‘వీ6 వెలుగు’లో సెప్టెంబర్​20న పబ్లిష్ అయిన ‘ఎల్ ఎండీ కట్ట కింద కబ్జా’ కథనానికి ఎస్సారెస్పీ అధికారులు స్పందించారు. ఎల్ఎండీ కట్ట కింద 954 సర్వే నంబర్ లో ఎకరం పది గుంటలు పట్టా భూమి అంటూ కొందరు వ్యక్తులు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. అది పూర్తిగా ఎల్ఎండీ కట్టకు దగ్గరగా ఉన్న భూమి కావడంతో ఎస్సారెస్పీ, రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. అనంతరం  కాంపౌండ్ వాల్ ను గురువారం రాత్రి జేసీబీతో కూలగొట్టించారు.  సర్వేలో ప్రాజెక్ట్​ ల్యాండ్ అని తేలడంతో కాంపౌండ్ వాల్ కూల్చివేశామని ఎస్సారెస్పీ ఎస్ఈ శివకుమార్ తెలిపారు.