
జగిత్యాల టౌన్, వెలుగు: బైక్‌లకు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ లను మాడిఫై చేసి వాడుతున్న 130 టూ వీలర్ లను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్‌తో వాటిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వెహికిల్‌ను సీజ్ చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తామన్నారు.
ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న వెహికల్స్ ను వినియోగిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, టౌన్ సీఐ వేణు గోపాల్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.