మోదానీ మెగా స్కామ్’పై దర్యాప్తు చేస్తం : జైరామ్ రమేశ్

మోదానీ మెగా స్కామ్’పై దర్యాప్తు చేస్తం : జైరామ్ రమేశ్

న్యూఢిల్లీ: ఒక్కో ఫేజ్ లోక్​సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బలపడుతూ వస్తున్నదని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ అన్నారు. ‘మోదానీ మెగా స్కామ్’ వెలుగులోకి వచ్చిందని, దీంతో టెంపోల్లో డబ్బుల తరలింపు కూడా పెరుగుతుందని ట్విట్టర్​లో విమర్శించారు. ‘‘2014లో ఇండోనేసియా నుంచి అదానీ తక్కువ క్వాలిటీ బొగ్గు కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముకుంటూ వేల కోట్లు సంపాదించాడు.

 తమిళనాడుకు హై క్వాలిటీ బొగ్గు అని చెప్తూ.. తక్కువ నాణ్యత కోల్​ను సప్లై చేశాడు. దీని ద్వారా రూ.3వేల కోట్ల లాభాలు వచ్చాయి. కరెంట్ బిల్లుల కారణంగా పేదోడు ఆర్థికంగా నష్టపోతున్నాడు. పర్యావరణం కలుషితం అవుతున్నది. కాగా, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అదానీ కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు కంపెనీ ప్రతినిధులు రాహుల్ గాంధీ కామెంట్లను ఖండించారు.