పాలస్తీనా అనుకూల ర్యాలీ.. కశ్మీర్ లో పలువురి అరెస్టు

పాలస్తీనా అనుకూల ర్యాలీ.. కశ్మీర్ లో పలువురి అరెస్టు

షోపియాన్: పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారని 21 మందిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ, పాలస్తీనాకు సంఘీభావంగా వీరు ర్యాలీ తీశారని పోలీసులు తెలిపారు. ఈ నిరసనల వల్ల లోయలో హింస చెలరేగే ప్రమాదం ఉందని, అందుకే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ జాతీయ జెండాను ఆందోళనకారులు చించేశారని, పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ గ్రాఫిటీలను గోడలపై రూపొందించారని పేర్కొన్నారు. గ్రాఫిటీ వేసిన ముదాసిర్ గుల్ అనే ఆర్టిస్ట్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఇజ్రాయెల్, పాలస్తీనాకు మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయాలపాలయ్యారు. అయినా గాజాపై యుద్ధాన్ని ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేయడం గమనార్హం.