
శ్రీనగర్: టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఫైరింగ్‌లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్, కుల్గాం జిల్లాలోని మునంద్ ఏరియాలో జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులతో కలసి ఆర్మీ రంగంలోకి దిగింది. టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో టెర్రరిస్టుల స్పాట్‌కు భద్రతా దళాలు చేరుకోగానే ఫైరింగ్ మొదలైంది. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో జవాన్లు కూడా ఎదురు కాల్పులు చేశారు. ఈ ఫైరింగ్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడ్ని ఇంకా గుర్తించలేదని కశ్మీర్ పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.