జమ్మూ కాశ్మీర్ లో విరిగిపడిన కొండచరియలు.. జమ్మూ శ్రీనగర్ రహదారి దిగ్భంధం..

జమ్మూ కాశ్మీర్ లో  విరిగిపడిన కొండచరియలు.. జమ్మూ శ్రీనగర్ రహదారి దిగ్భంధం..

జమ్మూ కాశ్మీర్లో ని రాంబన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూశ్రీనగర్ నేషనల్ హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.T2 వద్ద కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ NHW బ్లాక్ చేయడంతో జమ్మూకు వెళ్తున్న అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు.  జూలై 19న రాంబన్ జిల్లాలో జాతీయ రహదారి-44 పై కొండచరియలు విరిగి పడిన తర్వాత  ఈ రోజు (ఆగస్టు 06)న 1,626 మంది యాత్రికుల తాజా బ్యాచ్‌తో అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఇప్పటివరకు జూలై 1 నుంచి3,888 మీటర్ల ఎత్తైన అమర్‌నాథ్ గుహ క్షేత్రాన్ని 4.17 లక్షల మంది యాత్రికులు సందర్శించారు.

270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాంబన్ జిల్లాలోని చంకర్‌కోట్ యాత్రి నివాస్ వద్ద యాత్రికులను నిలిపివేశారు. ఇది కీలా మోర్ సమీపంలో కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక ఆల్-వెదర్ రహదారి అని అధికారులు పేర్కొన్నారు.అయితే రోడ్డు మార్గం పునరుద్దరించేవరకు యాత్రికులు ప్రయాణం రద్దు చేసుకోవాలని సూచాంచారు.