శ్రీనగర్ నడిబొడ్డున ఎగిరిన మువ్వన్నెల జెండా..

శ్రీనగర్ నడిబొడ్డున ఎగిరిన మువ్వన్నెల జెండా..

శ్రీనగర్ నడిబొడ్డున మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జమ్మూకశ్మీర్ జెండాను తీసిపారేసి జాతీయ జెండాను ఎగరేశారు. శ్రీనగర్ లోని సివిల్ సెక్రటేరియట్ లో ఈ ఘటన జరిగింది. శ్రీనగర్ సివిల్ సెక్రటేరియట్ బిల్డింగ్ పై ఇప్పటివరకు జమ్మూకశ్మీర్ జెండాతో భారత జాతీయ పతాకం ఉండేది. అయితే జమ్మూకశ్మీర్ జెండాకే ఉన్నత ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని స్వయం ప్రతిపత్తి రద్దు కావడంతో… జమ్మూకశ్మీర్ జెండా కూడా రద్దు అయింది. ఇక త్రివర్ణ పతాకం ఒక్కటే మిగిలింది. దానిని ఉన్నత స్థానంలో ఎగరేశారు అధికారులు.

జమ్మూకశ్మీర్ లో నిత్యావసరాలు, అత్యవసర వస్తువులకు ఎలాంటి కొరతా లేదన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్. అన్ని రకాల ఔషదాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బక్రీద్ రోజున ప్రజల ఇళ్లకే మాంసం, కూరగాయలు, గుడ్లు పంపించామన్నారు. మరో 15 రోజుల్లో రాష్ట్రంలో మార్పు చూస్తారని చెప్పారు మాలిక్. ఇలాంటి పరిస్థితులే గతంలో ఎదురైతే… మొదటివారంలోనే 50మంది చనిపోయేవారని… తాము తీసుకున్న చర్యలతో ఒక్క ప్రాణం కూడా పోలేదన్నారు.