ప్రారంభానికి సిద్ధమైన తులిప్ గార్డెన్

ప్రారంభానికి సిద్ధమైన తులిప్ గార్డెన్

ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ప్రారంభానికి సిద్ధమైంది. విరబూసిన రంగు రంగుల పువ్వులతో జమ్ము కశ్మిర్ లోని తులిప్ గార్డెన్ ఆకట్టుకుంటుంది. గార్డెన్ ను తిరిగి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్ల పూర్తయ్యాయన్నారు ఫ్లోరికల్చర్ డిపార్ట్ మెంట్ కమిషనర్ షేక్ ఫయాజ్. గార్డెన్ కోసం 9 నెలల నుంచి పని చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యటలకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. 

ఇది ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్. మొత్తం 74 ఎకరాల విస్తీర్ణంలో గార్డెన్ ఉందని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల్ని పెంచేందుకు 2007లో తులిప్ గార్డెన్ ను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వసంత రుతువు స్టార్ట్ అయ్యే టైంలో ఇక్కడ తులిప్ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. 

తులిప్ పువ్వులను కేవలం గృహ అలంకరణకు మాత్రమే ఉపయోగిస్తారు. వివిధ రంగులతో విరభూసే తులిప్ పువ్వుల అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. వసంతం ప్రారంభంలో దర్శనమిచ్చే ఈ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. హంగేరి, కజకిస్థాన్, నెదర్లాండ్, టర్కీ వంటి దేశాలు తులిప్ ను తమ జాతీయ పుష్పంగా ప్రకటించాయి.