
జనగామ అర్బన్, వెలుగు: జల సంరక్షణపై దృష్టి పెట్టడంతో వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించినట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. మంగళవారం జల శక్తి అభియాన్ కార్యక్రమాలతో ప్రగతి సాధిస్తున్న రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో ఢిల్లీ నుంచి నేషనల్ వాటర్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్అర్చన రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. దీంతో జిల్లా యంత్రాంగాన్ని ఢిల్లీ అధికారి అభినందించారు.
అనంతరం కలెక్టర్ వానాకాలం, యాసంగి 2024-–25 సీఎంఆర్ డెలివరీ, రాబోవు వానాకాలం 2025-–26 సంసిద్ధత తదితర అంశాలపైన కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సంబంధిత జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లతో రివ్యూ చేశారు. రైస్ మిల్లర్లు సీఎంఆర్ ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలన్నారు. సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. జనగామ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని, మెట్ల దారిని పునర్నిర్మించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌కు సీపీఎం జనగామ పట్టణ కమిటీ సభ్యుడు బూడిద గోపి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.