జనగామ, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిలో పలువురికి జనగామ ఏడీఎం కోర్టు జడ్జి సందీప స్వల్పకాలిక జైలు శిక్ష విధించారు. మరికొందరికి జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన బోయిని రాజు, ఎండీ అక్బర్ బాషా, మాలోతు బాలుకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పట్టుబడిన మరో 12 మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.
