సూపర్ మార్కెట్లో జాన్వీకపూర్ డ్యాన్స్.. వీడియో వైరల్..

సూపర్ మార్కెట్లో జాన్వీకపూర్ డ్యాన్స్.. వీడియో వైరల్..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ది పంజాబ్బన్ సాంగ్‌ కు డాన్స్ చేసి ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇన్ ష్టాలో ట్యాగ్ చేస్తూ,జగ్ జగ్ జీయో మూవీలో తన కొత్త పాటకు హుక్ స్టెప్ వేయమని జాన్నీకి ఛాలెంజ్ చేయగా.. జాన్వీ తన సరదా వీడియోను పోస్ట్ చేసింది. జాన్వీ ఓ సూపర్ మార్కెట్‌లో చేసిన ది పంజాబ్బన్ డ్యాన్స్ వైరల్ గా మారింది. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అంతేకాదు ఈ వీడియోకు జాన్వీ #JugJugJeeyo, #nachpunjaban, #famstep అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది. ఈ సాంగ్ కు స్టెప్పులు వేయాలంటూ జాన్వీ మరికొందరికి ఈ డాన్స్ ఛాలెంజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరోవైపు ఈ సాంగ్ కు హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్‌ అనన్యలు అదిరిపోయే హుక్‌ స్టేప్‌ వేసి సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చారు. వీరి డాన్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.ఈ వీడియోకు విజయ్‌ ఫ్యాన్స్‌ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ది పంజాబ్బన్ సాంగ్‌ ట్రెండింగ్ దూసుకుపోతుంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ananya ?? (@ananyapanday)