ఆఫీషియల్.. రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్

ఆఫీషియల్.. రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్

దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరో బంపరాఫర్ కొట్టేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసింది.  ఉప్పెన మూవీ ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో #RC16 మూవీ తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా ఏ హీరోయిన్ నటిస్తోందోనని ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు ప్రచారం జరిగింది.

 ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్.. #RC16లో రామ్ చరణ్ కు జోడీగా నటించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2024, మార్చి 6వ తేదీ బుధవారం జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. దీంతో జగదేకవీరుడు కొడుకు.. అతిలోక సుందరి కూతరికి జోడీ కుదురిందంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్ పి పరుశురామ్ తదితర సినిమాల్లో జోడీగా నటించి మెప్పించారు.

 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా.. పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటించనున్నారు.

 కాగా, రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉన్నాడు. ఇక, జాన్వీ కూడా దేవర సినిమాతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.వీటితోపాటు పలు హిందీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీబిజీగా ఉంది ఈ భామ.