Janhvi Kapoor: ‘పెద్ది’కి పాజిటివ్ రెస్పాన్స్.. కాలినడకన జాన్వీ శ్రీవారి దర్శనం..వైరల్ అవుతున్న ఫొటోలు

Janhvi Kapoor: ‘పెద్ది’కి పాజిటివ్ రెస్పాన్స్.. కాలినడకన జాన్వీ శ్రీవారి దర్శనం..వైరల్ అవుతున్న ఫొటోలు

బాలీవుడ్ బ్యూటీ, ‘పెద్ది’ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. రామ్ చరణ్-జాన్వీ నటించిన ‘పెద్ది’ విడుదల నేపథ్యంలో గురువారం మే4న  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకునుని మొక్కులు చెల్లించుకున్నారు. జాన్వీతో పాటు సీనియర్ నటి, ‘గులాబీ’ ఫేమ్ మహేశ్వరి కూడా పాల్గొన్నారు.

‘పెద్ది’కి పాజిటివ్ రెస్పాన్స్..

సాధారణంగా వ్యక్తిగతంగా ముఖ్యమైన సందర్భాల్లోనూ తిరుమలను సందర్శించే జాన్వీ, ఈసారి ‘పెద్ది’ ప్రీమియర్ షోలకు పాజిటివ్ టాక్ రావడంతో కృతజ్ఞతగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో జాన్వీ కపూర్‌ను చూసిన అభిమానులు, భక్తులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం జాన్వీ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘అచ్చియమ్మ’గా ఆకట్టుకున్న జాన్వీ

తెలుగులో ‘దేవర’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌కు ఆ చిత్రంలో పెద్దగా స్కోప్ దక్కలేదు. అయితే ‘పెద్ది’లో అచ్చియమ్మ పాత్రతో ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 'ఫైర్స్ అండ్ ఫియర్‌లెస్' క్యారెక్టర్ లో తనదైన అందాలతో మెప్పించిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి  జాన్వీ కెరీర్‌కు ‘పెద్ది’ టర్నింగ్‌ పాయింట్ అవుతుందా లేదా అనేది చూడాలి.