జన్‌‌‌‌మై ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్​ రూ. 64.67 కోట్ల డిపాజిట్ల సీజ్​

జన్‌‌‌‌మై ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్​ రూ. 64.67 కోట్ల డిపాజిట్ల సీజ్​

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్​ వజీర్‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌ను నడిపే జన్‌‌‌‌మై ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్​కు చెందిన రూ. 64.67 కోట్ల డిపాజిట్లను సీజ్​ చేశామని ఈడీ ప్రకటించింది. మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌‌‌‌లోని జన్​మై ల్యాబ్స్​ డైరెక్టర్​ ఆఫీసులో దాడులు నిర్వహించి వీటిని సీజ్​ చేశామని వెల్లడించింది. దర్యాప్తునకు నిందితుడు సహకరించడం లేదని ఆరోపించింది. అనేక చైనీస్ లోన్ యాప్‌‌‌‌లు (మొబైల్ అప్లికేషన్‌‌‌‌లు) మన దేశంలో చట్టవిరుద్దంగా బిజినెస్ ​చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ  క్రిప్టో ఎక్స్ఛేంజీకి వ్యతిరేకంగా ఏజెన్సీ ఈ చర్య తీసుకుంది.

ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌‌‌‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈడీ పోయిన సంవత్సరమే వజీర్​ఎక్స్‌‌‌‌పై అభియోగాలు మోపింది. "వజీర్‌‌‌‌ఎక్స్ డైరెక్టర్ సమీర్ మాత్రేకే ఎక్స్ఛేంజ్​ డేటాబేస్‌‌‌‌కు పూర్తి రిమోట్ యాక్సెస్ ఉంది. ఈయన చైనీస్​ ఇన్‌‌‌‌స్టంట్ లోన్ యాప్స్​ ద్వారా వచ్చిన డబ్బు నుండి కొనుగోలు చేసిన క్రిప్టో ఆస్తులకు సంబంధించిన లావాదేవీల వివరాలను అందించడం లేదు. కేవైసీ నిబంధనలను పట్టించుకోకపోవడం, వజీర్​ఎక్స్​–  బైనాన్స్​ మధ్య అనుమానాస్పద లావాదేవీలు, ఖర్చులను ఆదా చేయడానికి బ్లాక్ చైన్‌‌‌‌లలో లావాదేవీలను రికార్డు చేయకపోవడం, వాలెట్ల కేవైసీని రికార్డు చేయకపోవడం వంటి కారణాల వల్ల డిపాజిట్లను జప్తు చేయాల్సి వచ్చింది" అని ఈడీ ఒక ప్రకటనలో ఆరోపించింది.