జిగర్తండ2, జపాన్ ఫస్ట్డే కలెక్షన్స్.. దివాళి సీజన్ గెలుపెవరిది?

జిగర్తండ2, జపాన్ ఫస్ట్డే కలెక్షన్స్.. దివాళి సీజన్ గెలుపెవరిది?

దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అవే లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన  జిగర్ తండ డబుల్ ఎక్స్(Jigar thanda Double X ), కార్తీ(Karthi) హీరోగా వచ్చిన జపాన్(Japan Movie). ఈ రెండు సినిమాలు కూడా మంచి అంచనాల మధ్య రిలీజ్ అవ్వగా.. ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ ను తెచ్చుకున్నాయి. 

అందులో జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమాకుక్ బెటర్ టాక్ వచ్చింది కానీ.. ఓపెనింగ్స్ మాత్రం కార్తీ సినిమాకు వచ్చాయి. రెండు సినిమాల బాక్సాఫిస్ రిపోర్ట్ చూస్తే.. కార్తీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి  2 కోట్ల షేర్ ను సాధించగా.. జిగర్ తండ సినిమాకు కోటి రూపాయల వరకు షేర్ వచ్చింది. ఓవరాల్ గా జపాన్ కు 6 కోట్లు.. జిగర్తండ2 5 కోట్లవరకు గ్రాస్ వచ్చిందని సమాచారం. దివాళి సీజన్ ను మాత్రం ఈ రెండు సినిమాలు ఉపయోగించుకోలేకపోయాయి. ఈ సినిమాల స్థాయికి ఆ కలెక్షన్స్ చాలా దారుణమే చెప్పాలి. రెండు సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆడియన్స్ కానీ.. జిగర్తండ2 కు వచ్చిన టాక్ తో ఈ సినిమాకు రానున్న రోజుల్లో కలెక్షన్స్ పెరిగే ఆవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల రిజల్ట్ ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.