జపాన్ మూన్ మిషన్: SLIM ల్యాండింగ్ సక్సెస్.. ఫస్ట్ ఇమేజ్ లను పంపింది

జపాన్ మూన్ మిషన్: SLIM ల్యాండింగ్ సక్సెస్.. ఫస్ట్ ఇమేజ్ లను పంపింది

జాబిల్లిపై పరిశోధనలకోసం జపాన్ మూన్ మిషన్ సక్సెస్ అయింది. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా దాని స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(SLIM) విజయవంతం గా ల్యాండ్ అయింది. మూన్ స్పిన్నర్ పేరుతో ఈ క్రాఫ్ట్ చంద్రుని ఉపరితలాన్ని లక్ష్యానికి 55 మీటర్ల దూరంలో తాకింది. దీంతో ఇండియా,యూఎస్, రష్యా, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన  ఐదవ దేశంగా జపాన్ నిలిచింది. 

చంద్రుని ఉపరితలంపై SLiM ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చూపుతున్న చిత్రాలను జపాన్ అంతరిక్ష సంస్థ JAXA విడుదల చేసింది. పిన్ పాయింగ్ సాఫ్ట్ ల్యాండింగ్ కీలకమైన విజయం.. అయితే వ్యోమ నౌక తేలికైన సోలార్ బ్యాటరీల ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ కొరత గురించి ఆందోళన చెందుతున్నట్లు జక్సా ప్రకటించింది. ఇంకా 12 శాతం పవర్ మాత్రమే మిగిలి ఉందని, చంద్రునిపై చీకటి రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ల్యాండర్ కార్యకలాపాలకోసం SLIM ను స్విచ్ ఆఫ్ చేయాలని నిర్ణయించిన జక్సా వెల్లడించింది. 

జపాన్ చంద్ర మిషన్ లక్ష్యాలు 

ప్రత్యేక కెమెరాలతో ఖనిజాలను విశ్లేషించడం ద్వారా చంద్రుని మూలాన్ని పరిశోధించడం SLIM  లక్ష్యం. క్రాఫ్ట్ అగ్ని పర్వత శిలలతో కప్పబడిన ప్రాంతమైన షియోలి క్రేటర్ సమీపంలో ల్యాండర్ దిగాలన లక్ష్యంగా పెట్టుకంది. ఈ శిలల విశ్లేషణ చంద్రునిపై నీటి వనరులపై విశ్లేషించగలదు. చంద్రునిపై స్థావరాలను నిర్మించే భవిష్యత్ ప్రణాళికలో ఇది కీలకమైంది. 

జపాన్ గతంలో చంద్రునిపై పరిశోధనలకు పంపించి రెండు మిషన్లు ఫెయిల్ అయ్యాయి. ఇది మూడోది. 2022లో జపాన్, అమెరికా సంయుక్తంగా ఆర్టెమెస్ 1 మిషన్ లో భాగంగా ఓమోటేనాషీ అనే చంద్రుని ప్రోబ్ ను ప్రయోగించింది. అయితే ఇది విఫలమైంది. 2022 ప్రారంభంలో జపనీస్ స్టార్టప్ ఇస్పేస్ పంపిన మొదటి ప్రైవేట్ కంపెనీ ప్రయోగం కూడా విఫలమైంది. తాజాగా పంపిన SLIM విజయవంతం కావడంతో జపాన్ .. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన  ఐదవ దేశంగా జపాన్ నిలిచింది.