Ram Charan: మెగా ఫ్యాన్స్కి చరణ్ బర్త్డే ట్రీట్.. జరగండి సాంగ్ అప్డేట్ వచ్చేసింది

Ram Charan: మెగా ఫ్యాన్స్కి చరణ్ బర్త్డే ట్రీట్.. జరగండి సాంగ్ అప్డేట్ వచ్చేసింది

మెగా ఫ్యాన్స్(Mega Fans) చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. తాజాగా ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer) నుండి ఫస్ట్ సింగల్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. మార్చ్ 27 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా గేమ్ ఛేంజర్ నుండి జరగండి(Jaragandi) అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారిక సోషల్ మీడియా నుండి ఈ ప్రకటన వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం మార్చ్ 27 ఉదయం 9 గంటలకి సాంగ్ విడుదల కానుంది. రామ్ చరణ్ సినిమా నుండి చాలా కాలం తరువాత వచ్చిన అప్డేట్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

నిజానికి గేమ్ ఛేంజర్ నుండి ఈ పాట చాలా కాలం క్రితమే రావాల్సింది. కొన్ని కారణాల వల్ల ఈ పాట విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అవడంతో.. అదే పాటను అఫీషియల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ, ఫైనల్ మ్యూజిక్ మిక్సింగ్ పనులు పూర్తి కాకపోవడంతో సాంగ్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఇక అప్పటినుండి ఈ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ తో వారంతా ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ లుక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఎస్ జె సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, ప్రియదర్శి,సునీల్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి థమన్ సంగీత సారధ్యంలో రానున్న గేమ్ ఛేంజర్ మొదటి సాంగ్ మెగా ఫ్యాన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.