
చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని జవహర్నవోదయ విద్యాలయంలో 2026–-27 అకడమిక్ ఇయర్‌లో 9వ, 11వ తరగతిలో ప్రవేశాలకు అప్లై చేసుకోవడానికి అక్టోబర్7వరకు గడువు పొడిగించినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.బ్రహ్మనందరెడ్డి తెలిపారు. 9వ తరగతి ప్రవేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 8వ తరగతి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అప్లై చేసుకోవాలనుకునే వారు నవోదయ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్కోరారు.