
షారుఖ్ ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దుమ్మే దులిపేలా, ఛల్ ఛల్ ఛలోనా సాంగ్స్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. మంగళవారం ‘రామయ్యా వస్తావయ్యా’ అంటూ సాగే మరొక పాటను విడుదల చేశారు.
అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన పార్టీ సాంగ్‌లో షారుఖ్, నయనతార ఎనర్జిటిక్‌గా డాన్స్ చేశారు. తెలుగులో చంద్రబోస్ లిరిక్స్ రాయగా, అనిరుధ్, శ్రీరామ్ చంద్ర, రక్షిత సురేష్ కలిసి పాడారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా, దీపికా పదుకొనె గెస్ట్‌గా కనిపించనుంది. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.