ఆజంఖాన్ వ్యాఖ్యలపై జయప్రద ఫైర్..!

ఆజంఖాన్ వ్యాఖ్యలపై జయప్రద ఫైర్..!

ఆజంఖాన్ తనపై వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారి కాదన్నారు రాంపూర్ బీజేపీ అభ్యర్థి జయప్రద. 2009లోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆజంఖాన్ కు తానేం అన్యాయం చేశానో తెలియదని అన్నారు. ఆజంఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని జయప్రద డిమాండ్ చేశారు. ఆజంఖాన్ లాంటి వారు గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. సమాజంలో మహిళలకు స్థానం లేదా అంటూ ప్రశ్నించారు.

మరోవైపు ఆజంఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. ఆజంఖాన్ తరచుగా మహిళలను కించపరుస్తూ మాట్లాడుతారన్నారు NCW  చైర్ పర్సన్ రేఖా శర్మ. ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఆజంఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.