Jayam Ravi, Kenisha: సింగర్ కెనీషాతో కలిసి జయం రవి శ్రీవారి దర్శనం.. మరో రూమర్స్ జంట, కపుల్స్ అవ్వనున్నారా?

Jayam Ravi, Kenisha: సింగర్ కెనీషాతో కలిసి జయం రవి శ్రీవారి దర్శనం.. మరో రూమర్స్ జంట, కపుల్స్ అవ్వనున్నారా?

తమిళ సినీ హీరో జయం రవి.. సింగర్ కేనీషాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం (2025 డిసెంబర్ 3న) ఉదయం సుప్రభాత సేవలో జయం రవితో పాటు అతని రూమర్ గర్ల్‌ఫ్రెండ్, సింగర్ కెనీషా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. గత ఆగస్టులో కూడా వీరిద్దరూ కలిసే శ్రీవారిని దర్శించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి తిరుమల సందర్శన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. హీరో జయం రవి తన భార్య 'ఆర్తి' నుండి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. రవి తన భార్య 'ఆర్తి'కి డివోర్స్ ప్రకటించగానే సడెన్గా బెంగళూరుకు చెందిన సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్లుగా వీళ్లు రిలేషన్‌లో ఉన్నారనే రూమర్ బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హీరో రవి తన సొంత బ్యానర్‌ 'రవి మోహన్‌ స్టూడియోస్‌' బ్యానర్‌లో కేనీషాని పార్ట్‌నర్‌గా ప్రకటించాడు రవి. దీంతో ఎక్కడికెళ్లినా వీరిద్దరూ కలిసే వెళ్లడం గమనార్హం!!

ఈ విడాకుల వివాదం నడుస్తున్నప్పటికీ రవి మోహన్ వృత్తిపరంగా బిజీగా ఉన్నారు. గణేష్ కె బాబు దర్శకత్వంలో 'కరాటే బాబు', అలాగే సుధా కొంగర దర్శకత్వంలో  'పరాశక్తి' చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. మరోవైపు, ఆర్తి తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తూ, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ లో-ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు.