జయశంకర్భూపాలపల్లి, వెలుగు: రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు వేగవంతంగా చేయాలని సీసీఐ ఆఫీసర్లు, మిల్లర్లకు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ పేర్కొన్నారు. శుక్రవారం చిట్యాల మండలంలోని ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లు, బాల మురగన్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను పరిశీలించారు.
పత్తి తేమ, తూకం (కాంటా), రైతుల నమోదు వివరాలు, కాపాస్ కిసాన్ యాప్లో నమోదు వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, తహసీల్దార్ ఇమామ్ బాబా, సీసీఐ ఇన్చార్జి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
