బెంగళూరు- హైదరాబాద్ మధ్య సర్వీసులు పెంచిన జజీరా ఎయిర్ వేస్

బెంగళూరు- హైదరాబాద్ మధ్య సర్వీసులు పెంచిన జజీరా ఎయిర్ వేస్

హైదరాబాద్​, వెలుగు: కువైట్​కు చెందిన చౌక ధరల విమానయాన  సంస్థ  జజీరా ఎయిర్‌‌‌‌వేస్ బెంగళూరు– హైదరాబాద్ విమానాల ఫ్రీక్వెన్సీని పెంచింది. ఈ నెల బెంగళూరు నుంచి రోజుకు 4 విమానాలు, హైదరాబాద్ నుంచి 6 విమానాలు నడుపుతోంది. గతంలో ఇది  రోజుకు మూడు విమానాలను నడిపేది. 2017 అక్టోబరులో హైదరాబాద్ నుంచి జజీరా తన భారత కార్యకలాపాలను ప్రారంభించింది. మనదేశంలోని ఆరు నగరాలకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం భారత్ నుంచి కువైట్ తదితర దేశాలకు 24  డైరెక్ట్ సర్వీసులను నడుపుతోంది.

ఈ సంవత్సరం వేసవి సీజన్ కోసం రెండు కొత్త యూరోపియన్ సిటీలకు సేవలను మొదలుపెట్టింది. సెర్బియాలోని బెల్​గ్రేడ్,  అల్బేనియాలోని టిరానా, చెక్ రిపబ్లిక్ ప్రేగ్, సారాజెవో, బోస్నియా హెర్జె గోవినాకు విమానాలను తిరిగి ప్రారంభించింది.  సైప్రస్ లోని లార్నాకా, ఈజిప్టులోని స్ఫింక్స్, మోంటెనెగ్రోలోని టివాట్, ఇరాన్ లోని షిరాజ్ లకు విమానాలను షురూ చేసింది. రియాద్ కు విమానాల ఫ్రీక్వెన్సీని రెట్టింపు చేసింది.