5 లక్షల యూనిట్ల మైలురాయిని  చేరుకున్న జేసీబీ

5 లక్షల యూనిట్ల మైలురాయిని  చేరుకున్న జేసీబీ

హైదరాబాద్, వెలుగు: ఎర్త్‌‌‌‌‌‌‌‌మూవింగ్, కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ తయారీదారు జేసీబీ‌‌‌‌‌‌‌‌ ఇండియా ఐదు లక్షల మెషీన్ల మైలురాయిని సాధించింది. దీని విడుదల వేడుకలను బల్లబ్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లోని కంపెనీ ఇండియా హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో జేసీబీ గ్రూప్ చైర్మన్ లార్డ్ బామ్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీబీ 1979 నుంచి భారతదేశంలో ఉందన్నారు.  మనదేశంలో ఆరు తయారీ సౌకర్యాలతో జేసీబీ 'మేడ్ ఇన్ ఇండియా' యంత్రాలను 130 దేశాలకు ఎగుమతి చేస్తోందన్నారు.