ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్‌ను ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ నియమించారు. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న ఎడువార్డ్ ఫిలిప్ రాజీనామా చేయడంతో… ఆ స్థానంలో కాస్టెక్స్ బాధ్యతలు చేపట్టారు. లాక్‌డౌన్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో మాక్రన్ తన ప్రభుత్వాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు. దశలవారీగా దేశాన్ని రీఓపెన్ చేయడంలో కాస్టెక్స్ కీలకంగా వ్యవహరించారు.
