నేటి నుంచి జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్

నేటి నుంచి జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్
  •      అటెండ్ కానున్న 1.20 లక్షల మంది స్టూడెంట్లు 

హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా నేటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్– 1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం పేపర్ 2 బీ–ప్లానింగ్ ఎగ్జామ్ ఉండనున్నది. పేపర్ 1 ఇంజినీరింగ్ ఎగ్జామ్‌‌‌‌ ఈ నెల 27, 29, 30, 31, ఫిబ్రవరి1 తేదీల్లో జరగనున్నది. మొత్తంగా జేఈఈ మెయిన్​ ఎగ్జామ్​కు తెలంగాణ నుంచి 1.20 లక్షల మంది అటెండ్ కానున్నారు. ప్రతి రోజూ ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఫిష్ట్  మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్​లైన్​ పరీక్ష జరగనున్నది. స్టేట్​లోని 11 ప్రాంతాల్లో  పరీక్ష కేంద్రాలను ఎన్​టీఏ ఏర్పాటు చేసింది.