విద్యార్థులు పరీక్షలపై చర్చ కోరుకుంటున్నారు: రాహుల్

విద్యార్థులు పరీక్షలపై చర్చ కోరుకుంటున్నారు: రాహుల్

న్యూఢిల్లీ: విద్యార్థులు పరీక్షలపై చర్చ కోరుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మన్‌ కీ బాత్‌లో భాగంగా ఆదివారం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇండియాను టాయ్ హబ్‌గా చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. స్టూడెంట్స్ బొమ్మలపై చర్చ కావాలని కోరుకోవడం లేదని, పరీక్షలపై చర్చ జరగాలని భావిస్తున్నారని సెటైరికల్‌గా రాహుల్ ట్వీట్ చేశారు. ‘జేఈఈ‌‌–నీట్‌విద్యార్థులు ప్రధాని మోడీని పరీక్షల పై చర్చ నిర్వహిచాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన బొమ్మలపై చర్చ పెట్టారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షల నిర్వహణ ఏంటని రాహుల్ ప్రశ్నించారు. దీనిపై విద్యార్థుల గొంతుకను వినాల్సిందిగా కేంద్రాన్ని కోరారు.