వారం రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం..

వారం రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం..

చనిపోయిన మహిళ మృతదేహంతో ఇంట్లోనే ఉంచుకుని ఓ కుంటుంబ జీవనం కొనసాగిస్తున్న ఘటన కుత్బుల్లాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఓ మహిళ(40) ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందింది. అయితే, మృతదేహానికి కుటుంబీకులు అంత్యక్రియలు చేయకుండా.. వారం రోజులుగా శవాన్ని ఇంట్లోనే  పెట్టుకుని జీవిస్తున్నారు. కుళ్లిపోయి పురుగులు పట్టినా అదే ఇంట్లో సాధారణంగా జీవనం కొనసాగించారు.

 తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే ఈ విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.