
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లకు 5 శాతం ఐఆర్ ప్రకటించడం అన్యాయమని, కనీసం 20 శాతం ప్రకటించాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఆర్సీ కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఆ కమిటీ నివేదిక వచ్చేంత వరకు 5 శాతం మాత్రమే ఐఆర్ప్రకటించడం సిగ్గుచేటన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2008లో 22 శాతం, 2013లో 27 శాతం ఐఆర్ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలు నిలిచిపోయాయన్నారు. నియామకాల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలను అంగట్లో అమ్ముతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తామని, 370 జీవో పున: పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.