లైంగిక ఆరోపణలు నిజం కాదు… కావాలనే కుట్ర

లైంగిక ఆరోపణలు నిజం కాదు… కావాలనే కుట్ర

వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయనున్న జో బిడెన్ తన పై వచ్చిన సెక్యవల్ హారస్ మెంట్ ఆరోపణలు ఖండించారు. ఇవి నిజం కాదు అని తానెప్పుడూ అలా ప్రవర్తించలేదని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిడెన్ స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ఆయనకు లైంగిక వేధింపుల అంశం నెగిటివ్ గా మారింది. దీంతో ఆయన స్పందించారు. 1992 లో అమెరికా సెనేట్ కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్ గా తారా రీడ్ అనే మహిళ పనిచేసే వారు. ఆ సమయంలో జో బిడెన్ పలుమార్లు లైంగిక వేధించారంటూ తారా ఆరోపించటం సంచలనం రేపింది. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి కూడా జో బిడెన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐతే తాను మహిళల ఉన్నతి కోసం పనిచేశానని వారికి సమాన అవకాశాలు వచ్చేందుకు పోరాడిన వ్యక్తినని జో బిడెన్ గుర్తుచేశారు. మహిళల పట్ల తన ప్రవర్తన పై ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు రాలేదని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎదురుదాడికి దిగారు.