అప్పులు తగ్గించుకుంటున్న సబ్సిడరీ

అప్పులు తగ్గించుకుంటున్న సబ్సిడరీ

హైదరాబాద్​, వెలుగు: తన సబ్సిడరీ మాంబా కాలరీస్​ లిమిటెడ్​ (ఎంసీఎల్​) ఫైనాన్షియల్​ పొజిషన్​ టర్న్​ అరౌండ్​ అయినట్లు నవ లిమిటెడ్​ వెల్లడించింది. అంతేకాదని, ఈ సబ్సిడరీ తీసుకున్న  అప్పులను తిరిగి చెల్లిస్తోందని తెలిపింది. 2022 డిసెంబర్​ నాటికి రూ. 3,999 కోట్లున్న అప్పులు ప్రస్తుతం రూ. 2,296 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఎనర్జీ సేల్స్​ పేమెంట్స్​ను జెస్కో  మే 2022 నుంచి ఎంసీఎల్​కి చెల్లిస్తోందని  వివరించింది.

మరోవైపు, జాంబియా ఎలక్ట్రిసిటీ సప్లయ్​ కార్పొరేషన్​ (జెస్కో) ఆర్బిట్రేషన్​ సెటిల్​మెంట్​ కింద బకాయిలను  ఎంసీఎల్​కి  చెల్లిస్తోందని,  ఈ ఏడాది డిసెంబర్​లోపు 338 మిలియన్​ డాలర్లను  జెస్కో చెల్లించనుందని తెలిపింది. మరో 180  మిలియన్​ డాలర్లను డిసెంబర్​ 2024 లోపు జెస్కో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇటీవల చెల్లించిన 60 మిలియన్​ డాలర్లతో కలిపి ఇప్పటిదాకా జెస్కో మొత్తం 181 మిలియన్​ డాలర్ల చెల్లింపులను ఎంసీఎల్​కు రిలీజ్​ చేసింది.