జియో ఫైనాన్స్ కు రూ.15 వేల కోట్లు

జియో ఫైనాన్స్ కు  రూ.15 వేల కోట్లు

న్యూఢిల్లీ: అంబానీ కుటుంబం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్​ఎస్​లో) లో రూ. 15,825 కోట్లు (దాదాపు రూ. 16,000 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ప్రమోటర్ల గ్రూప్ సభ్యులకు కన్వర్టిబుల్ వారెంట్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు కంపెనీ బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. 

ఈ పెట్టుబడితో కంపెనీలో ప్రమోటర్ల వాటా 47.12 శాతం నుంచి 54.19 శాతానికి పెరుగుతుంది. ఈ నిధులను జియో ఫైనాన్షియల్ తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని విస్తరించడానికి, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి ఉపయోగించనుంది. జియో ఫైనాన్షియల్ ప్రస్తుతం పెట్టుబడులు, లోన్లు, బీమా బ్రోకింగ్, చెల్లింపు సేవలను అందిస్తోంది. ఈ భారీ నిధుల సమీకరణ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలకు బలం చేకూరుస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.