
నల్గొండ సహా దేశంలోని మరో 50 సిటీలకు జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం 184 సిటీల్లోని జియో యూజర్లకు ట్రూ 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సిటీల్లోని యూజర్లు జియో వెల్‌కమ్ ఆఫర్ అందుకుంటారని, దీని కింద 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అన్ లిమిటెడ్ డేటా వస్తుందని పేర్కొంది. ఇందుకు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసవరం లేదని స్పష్టం చేసింది. ఏపీలోని చిత్తూరు, ఒంగోలు, కడప సిటీల్లోనూ జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.