అంబానీ కంపెనీలోనూ ఉద్యోగాల ఊస్టింగ్.. రాజీనామా చేయాలని 1000 మందికి ఆదేశాలు

అంబానీ కంపెనీలోనూ ఉద్యోగాల ఊస్టింగ్.. రాజీనామా చేయాలని 1000 మందికి ఆదేశాలు

 ఉద్యోగాల కోత కొనసాగుతోంది. టెలికం కంపెనీలు,  సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు  అమెజాన్, గూగుల్, జాబ్ సెర్చింగ్ యాప్, ఫోర్డ్ మోటార్స్, డెల్ ,వాల్డ్ డిస్నీ  ఉద్యోగులను తొలగించిన లిస్టులో ఉండగా.. ఇపుడు ఈ లిస్టులోకి ప్రపంచ కుబేరుల్లో ఒకరైనా అంబానీ ఈ కామర్స్ దిగ్గజం జియోమార్ట్  కూడా చేరిపోయింది.1000 మంది ఉద్యోగులను  ఇంటికి సాగనంపుతోంది. 

జియో మార్ట్  తన కార్పొరేట్ సంస్థలో 500 మంది ఎగ్జిక్యూటివ్‌లతో సహా 1000 మంది ఉద్యోగులను రాజీనామా చేయవలసిందిగా కోరినట్లు సమాచారం. ఉద్యోగులను తొలగించడంతో పాటు కొందరు ఉద్యోగులను తమ పనితీరును మార్చుకొమ్మని ఆదేశించారని తెలుస్తోంది. కొంత మంది ఉద్యోగులను అదే సంస్థలో ఇతర చోట్లకు మార్పులు చేయడంతో పాటు సీనియర్ల జీతాలను కూడా తగ్గించారని సమాచారం.

రిలయన్స్ రిటైల్ ఇటీవలే 344 మిలియన్ డాలర్లతో మెట్రో ఏజీ హోల్ సేల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. తాజా సంస్కరణల వెనుక ఇది కూడా ఒక కారణమేనని తెలుస్తోంది. దేశంలో మారుమూల కిరాణా దుకాణాలకు  హోల్ సేల్ ధరలకు సరుకులను అందించాలని రిలయన్స్ రిటైల్ కు చెందిన జియో మార్ట్ సేవలను ప్రారంభించింది. అయితే ఈ వ్యాపార  ప్రస్తుతం అనుకూలంగా లేనందున B2B వ్యాపారంలో దూకుడు తగ్గించాలని రిలయన్స్  నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అంబానీ తమ సంస్థల్లో పనిచేసే  ఉద్యోగులను తీసేయేడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.   ప్రపంచ కుబేరుడైన అంబానీకి కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయా? ఎందుకు ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.