హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్

 హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్

జార్ఖండ్ రాష్ట్రంలోని రాజకీయాలు హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నాయి. జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈడీ అరెస్టుతో సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్.. తర్వాత సీఎంగా చాంపై సోరెన్ ను ఎంపిక చేశారు. తమ పార్టీలకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని జార్ఖండ్ గవర్నర్ కు లేఖ ఇచ్చిన తర్వాత.. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో ఎయిర్ పోర్టుకు తరలించారు పార్టీ అధినేతలు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నట్లు చెబుతున్నారు అక్కడి నేతలు. హైదరాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు. 

చాంపై సోరెన్ సీఎంగా ప్రమాణస్వీకారం, ఆ తర్వాత అసెంబ్లీలో బలనిరూపణకు సమయం ఉండటంతో.. ఈలోపు ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. జార్ఖండ్ లో ఉంటే ఎమ్మెల్యేలు జారిపోయే ప్రమాదం ఉండటంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని భావించారు. ఈ క్రమంలోనే 43 మంది  ఎమ్మెల్యేలతో ప్రత్యేక విమానం రాంచీ నుంచి బయలుదేరి.. హైదరాబాద్ రానుంది. హైదరాబాద్ లో ఎక్కడ సిటీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటారా లేక సిటీ శివార్లలోని రిసార్టులో క్యాంప్ ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. జార్ఖండ్ రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయినట్లు తెలుస్తుంది..