
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్ధినిపై లైంగిక దాడి జరిగింది. లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. విచారణలో నిందితుడు జేఎన్‌యూ విద్యార్ధి రాఘవేంద్ర మిశ్రాగా గుర్తించారు. మిశ్రా మాజీ ఏబీవీపీ మెంబర్ గా, గత జేఎన్‌యూ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
క్యాంపస్ రూమ్ లోకి చొరబడ్డ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడడంతో అప్రమత్తమైన బాధితురాలు అలారమ్ మోగించడంతో సెక్యూరిటీ గార్డ్ లు మిశ్రాను అడ్డుకొని తమకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, 323 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు.