అబ్దుల్ కలాం OSD పేరుతో జాబ్ ఫ్రాడ్.. ఢిల్లీ నేతలతో పరిచయాలున్నాయని చెప్పి..

అబ్దుల్ కలాం OSD పేరుతో జాబ్ ఫ్రాడ్.. ఢిల్లీ నేతలతో పరిచయాలున్నాయని చెప్పి..

అబ్దుల్ కలాం ఓఎస్డీ పేరుతో జాబ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గ్రూప్ 1 అభ్యర్థి దగ్గర రూ. 7 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు సయ్యద్ హైదర్ హుస్సేన్ అనే వ్యక్తి. బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఢిల్లీలో ఉన్న నేతలతో పరిచయాలు ఉన్నాయని, ఫోటోలు చూపించి అబ్దుల్ కలాం ఓఎస్డీగా ఉద్యోగం ఇప్పిస్తానని గ్రూప్ 1 అభ్యర్థిని మోసం చేశాడు సయ్యద్ హైదర్ హెహుస్సేన్.

2022 లో గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అభ్యర్థి దగ్గర రూ. 7 లక్షలు వసూలు చేశాడు నిందితుడు. 2022 లో రెండు సార్లు పరీక్ష రద్దయింది కాబట్టి కొంత సమయం ఇవ్వాలని చెప్పి కాలం నెట్టుకొచ్చాడు నిందితుడు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన అభ్యర్థి తాను చెల్లించిన డబ్బులకు చెక్ రాసి ఇవ్వాలని సయ్యద్ పై ఒత్తిడి తెచ్చాడు.

అభ్యర్థి ఒత్తిడి తేవడంతో తనను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు సయ్యద్. దీంతో మోసపోయానని గ్రహించిన అభ్యర్థి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.