
‘మేకిన్ ఇండియా’ ఫలితాలు వస్తున్నాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లెక్కలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగం తగ్గిందని, తాజా రిపోర్టు తేల్చి చెప్పింది. నిరుద్యోగ యువతకు ‘స్కిల్ ఇండియా’ స్కీమ్ ద్వారా నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రైనింగ్ తీసుకున్న యూత్ కి సంబంధించిన ఫ్యాక్టరీ లు, పరిశ్రమల్లో ఉద్యోగాలు బాగా దొరుకుతున్నాయి.
మోడీ సర్కారు వచ్చాక ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని చేసే ఆరోపణల్లో నిజం లేదని ఒక సర్వే గట్టిగా చెబుతోంది. ఈ ఆరోపణని కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే ఆరోపణని పదే పదే ప్రచారంలోకి తేవడం తెలిసిందే. ఈ ఆరోపణలు అవాస్తవమని ‘నేషనల్ స్టాటిస్ టికల్ ఆఫీస్ (ఎన్నెస్ ఓ) విడుదల చేసిన లెక్కలు తేల్చి చెప్పాయి. కుర్రకారుకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయంటున్నాయి ఈ లెక్కలు. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయని స్పష్టం చేశాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు లెక్కలు తీస్తే… పట్టణ నిరుద్యోగంలో బాగా తగ్గుదల కనిపించిం దని ఎన్నెస్ వో పేర్కొంది. అర్బన్ ఏరియాల్లో నిరుద్యోగం (యుఆర్) అతి తక్కువ స్థాయికి 9.3 శాతానికి పడిపోయిందని ఈ సర్వే స్పష్టం చేసింది.
పట్టణ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్
పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. వీళ్లందరికీ ఉద్యోగాలు దొరకడం దాదాపు అసాధ్యం . దీంతో సహజంగానే అన్ ఎంప్లాయిమెంట్ సమస్య తెరపైకి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఎంప్లాయిమెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ బ్యాక్ డ్రాప్ లో అర్బన్ ఏరియాల్లో యూత్ కు ఉద్యో గాలు కల్పిం చే పనికి కేంద్ర ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది.
ఆదుకుంటున్న స్కి ల్ ఇండియా
నిరుద్యోగ యువతను బాగా ఆదుకుం టున్న పథకం ‘స్కి ల్ ఇండియా’. దేశంలోని వివిధ పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేసే యూత్ కి స్కి ల్ డెవలప్ చేయాలని సర్కారు నిర్ణయించింది. వాళ్ల వాళ్ల వృత్తులకు సంబంధిం చిన నైపుణ్యాన్ని మరిం తగా పెంచడానికి మోడీ ప్రభుత్వం ఓ పథకం అమలు చేస్తోంది. ‘నేషనల్ స్కి ల్ డెవలప్ మెంట్ మిషన్ (ఎన్ఎస్డీఎం)’ కింద కుర్రకారుకు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా ట్రైనింగ్ తీసుకుని స్కి ల్స్ ను డెవలప్ చేసుకున్న యూత్ కి సంబంధిం చిన ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు బాగా దొరుకుతున్నాయి.
కంప్యూటర్ తో పెరిగిన అవకాశాలు
కొన్నే ళ్లుగా అన్ని రంగాల్లో కంప్యూటర్ వాడకం ఎక్కువైంది. సర్కారీ ఉద్యోగాల్లో నే కాదు, ప్రైవేటు రంగంలో కూడా కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలిసినవారికి అవకాశాలు పెరుగుతున్నాయి. డిగ్రీ తరువాత కంప్యూటర్ కోర్సులు చేసినవారికి ఉద్యోగ అవకాశాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై నెలలో ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. జూన్ నెలతో పోలిస్తే జూలైలో 40 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కార్మికుల అవసరం ఎక్కువగా ఉంటుంది. కార్మికుల సంఖ్యను లెక్కలోకి తీసుకుం టే 37.7 శాతం మంది సొంతంగా చిన్న మధ్యతరహా కార్ఖా నాలు పెట్టుకున్నవారే. మొత్తం కార్మికుల్లో యాభై శాతం మంది ఫ్యాక్టరీల్లో రెగ్యులర్ ఎంప్లాయిస్ గా ఉన్నారు.
యూత్ కి మేకిన్ ఇండియా వరం
నరేం ద్ర మోడీ ప్రభుత్వం ఫస్ట్ టైమ్ అధికారంలోకి రాగానే ప్రారంభించిన పథకం ‘మేకిన్ ఇండియా’. ఈ పథకానికి అనేక లక్ష్యాలున్నాయి. దేశంలో ప్రొడక్టివిటీ పెం చడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించడం ఇందులో ముఖ్యమైనవి. ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని ఉపయోగిం చుకుని దేశవ్యాప్తంగా అనేకమంది స్థానిక పరిస్థితుల ఆధారంగా పరిశ్రమలు పెట్టుకున్నారు. ఇలా కొత్తగా పుట్టుకొచ్చి న పరిశ్రమల్లో వైట్ కాలర్ ఎంప్లాయీస్ తో పాటు స్కి ల్డ్ లేబర్ కూడా అవసరమయ్యారు. దీంతో చాలామందికి ఉద్యోగాలు దొరికాయి. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గడానికి ఈ స్టార్టప్ లు కూడా కారణమయ్యాయి. వీటితో పాటు అర్బన్ ఏరియాలోని యువతకు కొలువులు చూపించడానికి మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. డిగ్రీలోపు చదువుకున్న వారికోసం చేతివృత్తుల్లో షార్ట్ టర్మ్ కోర్సు లు నిర్వహిస్తోంది. సహజంగా పట్టణ ప్రాంతాల్లో బిల్డిం గ్ కన్ స్ ట్రక్షన్ రంగం ఎప్పుడూ బూమ్ లో ఉంటుం ది. దీనికోసం రాడ్ బెండిం గ్, ప్లంబింగ్ వంటి పనులు తెలిసినవాళ్లు అవసరమవుతారు. టెన్త్ వరకు చదువుకున్నవారికి ఇలాంటి కోర్సు ల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలా ట్రైనిం గ్ పూర్తి చేసుకున్నవారికి నిర్మాణ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో నూ, రియల్టర్ రంగంలోనూ వీరికి ఉద్యోగాలు బాగా దొరుకుతున్నాయి.
పల్లెల్లో నూ ఉద్యోగాలు పెరిగాయి
పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లో కూడా ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుం చి మార్చి
వరకు లెక్కలు తీస్తే గ్రామాల్లో కూడా నిరుద్యోగం తగ్గిం ది. యూత్ కు ఉద్యోగాలు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి
నాటికి దేశవ్యాప్తంగా 27.1కోట్ల ఉద్యోగాలుండగా మార్చి నాటికి ఉద్యోగాల సంఖ్య 27.5 కోట్లకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు కిందటేడాది ఏప్రిల్–జూన్ నాటికి 9.9 శాతంగా నమోదైంది. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో 9.7 శాతంగా రికార్డయిం ది. అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు లెక్కలు తీస్తే 9.9 శాతంగా నమోదైంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలకు స్టాటిస్టి క్స్ తీస్తే అతి తక్కువ స్థాయి 9.3 శాతానికి తగ్గిం ది. మొత్తం మీద యూత్ కు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.