
డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి జో బిడెన్‌పై పదే పదే విమర్శలకు దిగుతున్నారు. బిడెన్ కూడా ట్రంప్‌పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రెసిడెంట్‌గా నామినేషన్ జో బిడెన్ అంగీకరించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో, ఎకానమీ విషయంలో విఫలమయ్యారంటూ ట్రంప్‌ను బిడెన్ దుయ్యబట్టారు. అమెరికాలో నెలకొన్న ఈ చీకటి కాలాన్ని అధిగమించాలన్నారు. ట్రంప్‌ను ఉద్దేశించి బిడెన్ మాట్లాడుతూ.. ‘ఆయన ఎలాంటి బాధ్యతా తీసుకోరు. ముందుండి నడిపించడానికి తిరస్కరిస్తారు. ఇతరులను నిందిస్తారు. నియంతలా వ్యవహరిస్తారు. అభిమానుల్లో విష జ్వాలలను రేకెత్తిస్తారు. ఇవి జీవితాలను మార్చే ఎన్నికలు. వచ్చే కొన్నేళ్ల పాటు అమెరికా భవితను నిర్ణయించే ఎన్నికలివి. వ్యక్తిత్వం బ్యాలెట్లో ఉంది. కరుణ, క్షీణత, సైన్స్, ప్రజాస్వామ్యం అన్నీ బ్యాలెట్‌లోనే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. డెలావేర్‌లోని విల్మింగ్టన్ హాల్లో నామినేషన్‌ను స్వీకరించిన బిడెన్ ఆ వేదికపై నుంచే పైవ్యాఖ్యలు చేశారు.